వెంకటగిరి:సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి శనివారంచేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు తిరుపతి జిల్లా కమిటీ సభ్యులు వడ్డేపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి సుబ్బయ్య, కార్యదర్శి ఎస్ ప్రసాద్ లు మాట్లాడుతూ గత 12 రోజుల నుండి మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నామన్నారు. వేతనాలు పెంచకుండా వారి సమస్యల పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉందని అన్నారు. ఈ విధంగా మొండిగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాల్ని ఇంటికి సాగనంపిన చరిత్ర మున్సిపల్ కార్మికులదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన సమస్యలనుపరిష్కారం చేయాలని అన్నారు. కార్మికులు ఏమి గొంతెమ్మ కోర్కెలు ఏమి కోరడం లేదని అన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని అడుగుతున్నామని,లేదంటే సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సిఐటియు నాయకులు వెంకటసుబ్బయ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.