తెగుళ్లు నివారణ కు సలహాలు ఇచ్చిన ఏ ఓ.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :
కలువాయి మండలం లో పచ్చి శనగ పంట కు వేరు కుళ్ళు తెగులు సోకి పంట ఎండి పోతుంది. ఈ నేపథ్యంలో పంట కళ్ళముందు అండిపోతుండడం తో రైతులు లబో దిబో మంటున్నారు. ఈ నేపథ్యంలో మండలం వ్యవసాయ అధికారి ప్రతాప్ దాసరపల్లి, వేరుబోట్లపల్లి గ్రామాల్లో పర్యటించి తెగులు సోకిన పంటను పరిశీలించారు. గ్రామాల్లో రైతులతో సమావేశం ఎర్పాటు చేసి తెగులు నివారణ కు ఏ మందులు వాడాలో సూచించారు. ఈ సందర్బంగా ఏ ఓ ప్రతాప్ విలేకరుల తో మాట్లాడుతూ….మండలం లో 1500 ఎకరాల్లో పచ్చి శనగ పంటను రైతులు సాగు చేసి ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం పంట కు వేరు కుళ్ళు తెగులు సోకి ఉందని తెలిపారు. తెగులు నివారణకు 2 గ్రాములు సాఫ్ పౌడర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలని చెప్పారు. మరల 7రోజులు తర్వాత మరల పిచికారీ చేస్తే వేరు కుళ్ళు తెగులు పూర్తి గా నివారించ బడుతుందని తెలియజేశారు. ఈ రైతుల సమావేశంలో గ్రామ సచివాలయం వీ ఏ ఏ వెంకట రత్నం, రైతులు పాల్గొన్నారు.
…………….
సార్ ఫోటో రైటప్.. రైతులకు సూచనలు ఇస్తున్న ఏ ఓ ప్రతాప్.
తెగులు సోకి అందుతున్న వేరు శనగ పంట.