సైదాపురం : సైదాపురం పరిధిలోని సైదాపురం, తిమ్మసముద్రం చెరువులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1433 పసలిలో భాగంగా స్థానిక గ్రామ ప్రజల సమక్షంలో చేపల చెరువు వేలం పాట నిర్వహించినట్లు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు వెల్లడించారు. మండల కేంద్రమైన సైదాపురంలోని పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం చేపల చెరువు వేలం పాట నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సైదాపురం, తిమ్మసముద్రం చెరువులకు రూ.4 లక్షలు ధర నిర్ణయించగా కుంచెం ఈశ్వరయ్య రూ.4.10 లక్షలకు చేపల చెరువును దక్కించుకున్నాడు. అదేవిధంగా చల్లా మస్తాన్ రూ.1.10 లక్షలకు వేలం పాటలో చెరువును దక్కించుకున్నారు.