డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ : వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదివారం తన ఎన్నికల ప్రచారాన్ని మార్ల గుంట, మాధవయ్య పాలెం, దేవులపల్లి, డి వడ్డిపల్లి పంచాయతీలలో నిర్వహించారు. ఈ సందర్భముగా ప్రజలు అభిమానులు కార్యకర్తలు నాయకులు రామ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయనందువలనే బాబును ప్రజలు ఓడించారున్నారు . ఇచ్చిన మాట ప్రకారం జగన్ హామీలను నెరవేర్చాడని అందుకే తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేద్దామన్నారు. ఈ ప్రాంత ప్రజల బలం నమ్మకం నా గెలుపుకు అద్దం పడుతుందన్నారు. నేదురుమల్లి బిడ్డగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధిని ముందు వరుసలో నిలబెడతానని హామీ ఇచ్చారు. పనిచేసేవారిని ప్రజలు తమ సేవకుడిని నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మండలంలోని అన్ని పంచాయతీల నుండి స్థానిక నాయకులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న కలిమిలి రాంప్రసాద్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మండల వైకాపా నాయకులు ఇదే స్ఫూర్తితో పని చేస్తే ఫ్యాన్ జోరుకు తట్టుకునేవారు లేరని ప్రజలు నుండి స్పందనగా వినపడుతోంది. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ వెలికంటి చెంచయ్య, ఎంపీపీ గోను. రాజశేఖర్,దశరధి రామిరెడ్డి, మామిడి శ్రీనివాసులు, చింతల శ్రీనివాసులు రెడ్డి, శ్రీహరి రెడ్డి, ఎమ్మెల్ నారాయణరెడ్డి, సామాది చెంచయ్య, నర్రావుల వేణుగోపాల్ నాయుడు, గోవర్ధన్ నాయుడు, మిట్టపాలెం బాబు, పులకంటి రామారావు,చిరంజీవి,సుధాకర్, వేముల మల్లికార్జున్, అరుణాచలం, ఘట్టమనేని శ్రీనివాసులు నాయుడు, కోళ్ల పూడి వేణుగోపాల్, కొల్లూరుబాలకృష్ణ, బొల్లంపల్లి కృష్ణ, విసి సుబ్బు, అనిల్ యాదవ్, జానకిరామ్,మామిడి ప్రభాకర్, నాగభూషణం రెడ్డి, రమేష్ గౌడ్ తదితరులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు .