శ్రీ వీర బాండ్య కట్ట బొమ్మ వ్యాపారి సంఘం వారు 16 వార్డు లో భలుమూరు వీధి లో సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నా.. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి రాజాసాయి కృష్ణ యచంద్ర , డాక్టర్ మస్తాన్ యాదవ్ వెంకటగిరి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.అనంతరం ఈ కార్యక్రమంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం నుంచి వ్యాపార నిమిత్తం వెంకటగిరి కి విచ్చేసి స్థిరపడిన వారి అందరికీ మీరు అడిగినట్లుగానే మీరందరూ ఒకే దగ్గర వ్యాపారం చేసుకోవడానికి సరైన స్థలమును కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. వెంకటగిరి నియోజవర్గానికి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది నేనేనని మీరందరూ నన్ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు.సాయి కృష్ణ యచంద్ర డాక్టర్ మస్తాన్ యాదవ్ , మాట్లాడుతూ మన వెంకటగిరి నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది మన రామన్నని మీరందరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అందరిని అర్థం చేసుకొని మీకు నచ్చిన విధంగా పరిపాల సాగిస్తారని చెప్పారు