బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
బిజెపి చేసిన అక్రమాలు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయి తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ పేర్కొ న్నారు.శుక్రవారం బాలయ్య పల్లె లో ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజ్రీవాల్ అరెస్టు తో బిజెపికి పతనం ప్రారంభ మైందన్నారు.వెంకటగిరి నియో జకవర్గం అభివృద్ధి కి కాంగ్రెస్ ఎంతో కృషి చేసిం ది.ఎట్టి పరిస్థితుల్లోనూ అధికా రంలోకి బిజెపి మళ్ళీ రాదన్నారు.రాష్ట్రలో వైసిపి పాలనలో నిరుపేదలు, నిరుద్యోగులు, విద్యార్థు లు, రైతులు, మహిళలు, ఉద్యోగులు నలిగిపోయా రన్నారు. వైసిపి దళిత వ్యతిరేక పాలన అవలం భించింద న్నారు.ప్రభుత్వ నిధులు దారి మళ్లిం చిఅనేక పథకాలను ఆపేసిందన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.
పోటీ :-ప్రచారం చేస్తున్న చింత.