వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
-కలిమిలి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసిన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి ని వెంకటగిరిలోనే కలిమిలి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అశయ సాధన దిశగా 175కి 175 స్థానాలు కైవసం చేసుకునేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. పార్టీలో నాయకులకు మనస్పర్ధలు ఉంటే సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్టు తెలియజేశారు. దీంతో జరగబోయే ఎన్నికల్లో టిడిపి టులెట్ బోర్డ్ పెట్టుకోవడం తథ్యం మని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గలో వెంకటగిరి గత మెజారిటీ కన్నా అత్యధిక మెజారిటీని సాధిస్తామని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని అభ్యర్థించారు. అనంతరం కలిమిలి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అనంతరం వైయస్సార్సీపి రాష్ట్ర పరిశీలకులు ఎం ఆర్ సి రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ రెడ్డిల లతో కలిసి కొంతసేపు వెంకటగిరి రాజకీయ స్థితిగతులపై చర్చించుకున్నారు. అనంతరం వెంకటగిరి రాజాలు సాయికృష్ణ యాచంద్ర , సర్వజ్ఞ కుమార యాచంద్ర రాజావారి కోటలో మర్యాదపూర్వకంగా నాయకులందరు కలిసి వెంకటగిరి రాజకీయ స్థితిగతుల గురించి చర్చించుకున్నారు