వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్ 10వ వార్డు కౌన్సిలర్ .నాగముంతల శివయ్య
వెంకటగిరి మున్సిపాలిటీలోని 10వ వార్డు లోని శ్రీ శ్రీ శ్రీ రుద్ర య్య స్వామి గుడి దగ్గర మరియు శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ గుడి దగ్గర కొబ్బరి కాయ కొట్టి మొదట రోజు అయిన ఈ రోజు సోమవారం 10వ వార్డు కౌన్సిలర్ నాగముంతల శివయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజలు ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ముఖ్యమంత్రి *నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు *నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్నారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ *గురుమూర్తి కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీగా గెలిపించాలని అందరిని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సజ్జా మధు మరియు శేరి శేఖర్ మరియు మాధన వెంకటేష్ మరియు కట్టా మునియ్య , చీరాల పరమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు