వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వైఎస్ఆర్సిపి తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , వెంకటగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే లక్ష్యంతో వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో ముందుగా ఎంపిక చేయబడిన 7 వార్డులలో ఉగాది రోజున వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు . ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ యొక్క దిశ, ప్రణాళికను ప్రజలకు తెలియజేయాలన్న సదుద్దేశంతో ఈ కార్యాలయాలను ప్రారంభించామని తెలియజేశారు. ఈపార్టీ కార్యాలయాలు పార్టీ నాయకులు మాట్లాడుకునేదానికి కాదని ,ప్రతి వార్డులో అవార్డు ప్రజల సమస్యలను గుర్తించి సమస్య పరిష్కార మార్గాలను సూచించేందుకు పార్టీ కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన పనులను నిర్భయంగా ప్రజలకు తెలియజేసి నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని,ఇంకా ఏమైనా అనుమానాలు సందేహాలు ఉంటే పార్టీ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకొని నిర్ధారణకు వచ్చి తరువాతే వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో *వెంకటగిరి రాజా గారు సర్విజ్ఞ కుమార యాచంద్ర గారు, డాక్టర్ మస్తాన్ యాదవ్ వెంకటగిరి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.