వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్‌ప్రెస్ న్యూస్
– వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
– ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వి బి సాయి కృష్ణ యాచేoద్ర
*
నాయుడుపేటలో గురువారం జరగబోయే ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టునటువంటి మేమంతా సిద్ధం బహిరంగ సభను విజయ వంతం చేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , ఎస్ వి బి సి చైర్మన్ డాక్టర్ బి బి సాయికృష్ణ యాచేoద్ర లు పేర్కొ న్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక నేదురుమల్లి నివాసంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు డాక్టర్ బి మస్తాన్ యాదవ్ తో కలిసి కార్యకర్తలు, నాయకులతో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభలు విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి , నేదురుమల్లి జనార్దన్ రెడ్డిల హయాంలో వెంకటగిరిలో ఎన్నో అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగ చేయడం, ప్రతి సచివాలయ పరిధిలో రూ 50 లక్షలతో అభివృద్ధి పనులు, ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పేదలు, బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. ఆయా వర్గాలకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం
గా ఉండాలన్నారు. అనంతరం వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు పడవలూరు ధనంజయ రెడ్డి తో సమావేశం అయ్యారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి తిరుపతి జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు నెమలపూడి సురేష్ రెడ్డి, న్యాయవాది ఎల్ కోటేశ్వరరా�