డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ని వెంకటగిరి వైకాపా అభ్యర్థిగా అక్కడ మెజార్టీతో గెలిపించాలంటూ వీకేవై సముద్రంలో వైకాపా మండల నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జే సి ఎస్ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైకాపాలనలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కరి ఇంటికి రాజకీయాలాతీతంగా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో చేరడం దేశ చరిత్రలోనే మొదటిదని, వాలంటీర్ వ్యవస్థతో ప్రజలు తమ ఇంటి దగ్గర నుండి పరిష్కరించుకున్నారని, పరిపాలనను గ్రామస్థాయి వరకు తీసుకు వచ్చినటువంటి ఘనత, నవరత్నాలతో పేదల జీవితాలలో వెలుగులు నింపారని అందుకే ప్రజలకు మేలు జరిగిందన్న నమ్మకం ఉంటే జగనన్నను ముఖ్యమంత్రి చేద్దామని, రామ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో వి కే వై సముద్రం గ్రామ సర్పంచ్ దాసరి పోలయ్య, వైకాపా మండల ప్రెసిడెంట్ పెట్లూరు జగన్మోహన్ రెడ్డి, నర్రావుల వేణుగోపాల్ నాయుడు,మామిడి శ్రీనివాసులు, ఎమ్మెల్ నారాయణరెడ్డి, కోళ్లపూడి వేణుగోపాల్ , దందోలు పెంచల రెడ్డి, నాగభూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.