ఆనం ఆత్మకూరు వెళ్లినా ఆయన ఆత్మ మాత్రం వెంకటగిరిలోనే వుంది.
Iవైసీపీ సర్పంచులకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు డబ్బుతో ఆనం గ్యాంగ్ ఎర
I వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్) అమాయకులైన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆనం గ్యాంగ్ డబ్బులతో ఎరవేసి ఆగడాలు చెయ్యాలనుకుంటున్నదని, దీనికి వెంకటగిరి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైసిపి జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. తానుఒక సమన్వయకర్తగా ఆది నుంచి అందరిని కలుపుకుని పోతూ పార్టీని బలోపేతం చెయ్యాలని ఆలోచిస్తుంటే మరో వైపు ఆనం గ్యాంగ్ సమన్వయానికి తిలోదకాలు పలుకుతూ, పార్టీ అధిష్టాన నిర్ణయాలను, వైపస్ జగన్మోహన్రెడ్డి చర్యలను ధిక్కరిస్తోందని విమర్శించారు. ఆదివారం సాయంత్రం నేదురుమల్లి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనం గ్యాంగ్ వెంకటగిరిలో చెడ్డీ గ్యాంగ్ లాగా ఆగడాలకు దిగుతోందన్నారు. ఇక్కడ టిక్కెట్ లభించక అవమానంతో ఆత్మకూరుకు వెళ్ళిన ఆనం రామనారాయణరెడ్డికి ఆత్మంతా వెంకటగిరిలోనే వుందన్నారు. నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా వుండి వెంకటగిరిని సర్వనాశనం చేసిన తరువాత కూడా వదలకుండా రాజకీయంగా కూడా ఆశాంతిని కలిగించే చర్యలకు తన గ్యాంగ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వెంకటగిరి ప్రజలు సమయం వచ్చినపుడు ఆయనకు, ఆయన గ్యాంగ్‌కు సమాధానం ఇస్తారని అన్నారు.
తాను ముందు నుంచి కూడా తనపై ఏవైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి విలేకరుల ప్రెస్‌మీట్ పెట్టిమాట్లాడమని చెప్పడం జరిగిందని, ఆ పని ఇప్పటికి కూడా చెయ్యకుండా ఆనం లాగా ఆయన గ్యాంగ్ కూడా రాత్రిపూట చీకటి రాజకీయం చేస్తోందన్నారు. పార్టీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్లకు ఆనం గ్యాంగ్ నుంచి డబ్బులిస్తామన్నట్లు కాల్స్ వస్తున్నవిషయాన్ని తన దృష్టికి తెచ్చారన్నారు. అయితే తాను వాళ్ళకు చెప్పిన విషయం ఒకటేనని, ఆనం గ్యాంగ్‌తో విషయాలు తెలుసుకుని మెలగాలని, లేకుంటే గ్యాంగ్ మీకు కూడా భవిష్యత్తు లేకుండా చేస్తుందని చెప్పడం జరిగిందన్నారు. అసలు డబ్బులు కూడా ఎందుకు ఆశ చూపుతున్నారో కూడా స్పష్టంగా తెలుసుకోమన్నానని వెల్లడిరచారు. ఏదో పగటి వేషగాళ్ళలాగా, మాయలోళ్ళులాగా డబ్బులిస్తాం పక్కన వచ్చినిలబడమంటే వాళ్ళేమైనా దారినపోయే దానయ్యలు కాదని, ప్రజల తీర్పుతో ఎన్నికైన ప్రజాప్రతినిధులన్నారు.
వైపస్ జగన్మోహన్రెడ్డి బస్సుయాత్రకు
అంతా సిద్ధం
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైపస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు తిరుపతి జిల్లా అంతా సిద్ధంగా వుందన్నారు. 2019 నాటికి మించిన ప్రజాదరణ ప్రస్తుతం రాష్ట్రంలో వుందన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా వున్నపుడే రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో ఆయనకు పట్టంగట్టారని, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఆయనకు 175 కు 175 స్థానాలు అందిస్తారన్నారు. తాను నియోజకవర్గంలో 94 వేల ఇళ్ళకు పైగా తిరిగినపుడు ప్రజల నాడి ఆర్థమైందని అన్నారు. త్వరలో జరగనున్న వైపస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రకు వెంకటగిరి నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.