I రెబల్‌గా నిలబడినా, ఉద్యమాలకు దిగినా నీ వెనుకే మేము..
I మా నమ్మకం నువ్వు
I తెలుగుదేశం పార్టీ బీసీలు
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
పార్టీలో ఉన్నామన్న భావనే తప్ప, బిసిలకు ఎస్సీపస్టీలకు నియోజకవర్గం లో ఒక గుర్తింపు, గౌరవం దక్కలేదని, ఈరోజున డాక్టర్ మస్తాన్ యాదవ్ వచ్చిన తరువాతనే కనీస గౌరవం దక్కుతోందని తెలుగుదేశం పార్టీలోని బిసిల తమ మనోగతాన్ని వెల్లడిస్తున్నా రు. పార్టీలో ఎంతోకాలంగా బిసి కులానికి చెందిన గంగోడు నాగేశ్వరరావుకు కూడా మస్తాన్ యాదవ్ వచ్చిన తరువాతనే పార్టీ కార్యాలయంలో కూడా కాస్తాకూస్తో గౌరవ మర్యాదలు దక్కుతుండటం నిజం కాదా అనే విషయాన్ని టిడిపిలోని ప్రతి ఒక్క బిసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంటుందని చెబుతున్నారు. మస్తాన్ యాదవ్ ఇంత ఉధృతంగా పార్టీలో బిసిల కోసం పోరాడకుంటే కురుగొండ్ల రామక్రిష్ణ కుటుంబంలో మరో రెండు మూడు తరాలు రాజ్యాధికారాన్ని అనుభవించినా ఆశ్చర్యం లేదంటున్నారు. మస్తాన్ యాదవ్ పార్టీలోని బిసిల కోసం పార్టీ రెబల్ అభ్యర్థిగా నిలబడినా, పార్టీలో బిసిల ఆత్మగౌరవం కోసం నినదించినా వారి వెనుకే నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నా రు. మస్తాన్ యాదవ్‌కు బిఫారం వచ్చేంతవరకు కూడా టిక్కెట్ రాకుంటే భవిష్యత్ కార్యాచరణ ఏమి వుంటుందో వేచి చూడాలి.