కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్..
కలువాయి మండలం కుల్లూరు లో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా స్వామి వారి ఉత్సవాలకు పుట్ట వద్ద పుట్ట మట్టిని మాదాసు గంగాధరం దంపతులు మేళతారాలతో దేవస్థానం తీసుకువచ్చి బ్రహ్మోత్సవాలను శ్యాస్రోతం ప్రారంభించారు. ఈ సందర్బంగా విష్వకసేన, పుణ్యాహవాచనము, రక్షాబంధనం, ఆచార్య రుత్వికరణ, మృత్సం గ్రహణం, అంకురార్పణ పూజలు చేశారు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ సింగిల్ ట్రష్టి ప్రభాకర్, కలువాయి మండల జెసిఎస్ కన్వీనర్ మాదాసు యజ్ఞ పవన్, భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు.