బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కూలి వేతనం గిట్టుబాటు ఉండాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొ న్నారు.మంగళవారం మండలంలోని వెంగమాంబ పురం గ్రామ పంచాయతీ మినీ అమృత్ సరోవర్ పనులను పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన ఉపాధి హామీ పథకం కూలీలతో మాట్లాడుతూ మీకు కూలి ఎంత గిట్టుబాటు అవుతోంది అని ఆరతీశారు. ఇక అన్ని కుటుంబాలకు 100 రోజు లు పనిధినాలు కల్పిస్తున్నారా.లేదా అని ప్రశ్నిం చారు.100 రోజులు పనులు కల్పించక పోతే ఉపాధి సిబ్బంది పై కఠినమైన చర్యలు తీసుకుం టామని తెలియజేశారు.ఇక గ్రామపంచాయతీ స్థాయిలో ఉన్న సెవెన్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మృత్యుంజయరావు, ఏపీవో, కరుణాకర్ రెడ్డి, ఈసీ మస్తానమ్మ, శ్రీనివాసులు, వెంకటయ్య, కిరణ్, రమేష్, టెక్నికల్ అసిస్టెంట్లు హాజరు కావడం జరిగినది.
పోటో:-ఉపాధి పనులు పరిశీలిస్తున్న పీడీ