డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :ఎన్నికల కోడ్ సందర్భంగా మండల వ్యాప్తంగా రాజకీయ పార్టీలు చెందిన ప్లెక్సీలు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయడం జరిగింది. మండల రిటర్నింగ్ అధికారి తాహిశిల్దార్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీవో లీల మాధవిలు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని, గ్రామ కార్యదర్శులు,వీఆర్వోలు గ్రామపంచాయతీలలో ఎన్నికల నిబంధనలను పాటించే విధంగా వ్యవహరించాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారం, రాజకీయ సమావేశాల్లో పాల్గొంటే చర్యలు తీసుకోవడంలో వెనుకాడేది లేదన్నారు.