వెంకటగిరి, వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్: వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లా ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ వైయస్సార్సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, వెంకటగిరి రాజా సంస్థానాధీశుకులు సాయి కృష్ణ యాచేంద్ర, తిరుపతి ఎంపీ గురుమూర్తి, నాయకులు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ శివశంకర్ రెడ్డి, ఎంఆర్సీ రెడ్డి ధనుంజయ్య రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ రామ్ కుమార్ రెడ్డికి అండగా నిలబడాలని కోరారు. అందరం సమష్టిగా వైసీపీ విజయానికి కృషి చేయాలి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతి వైసిపి అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగే ధైర్యం మనకు సీఎం జగన్ ఇచ్చారని తెలిపారు. జన్మభూమి కమిటీలతో దోచుకున్న టిడిపి నాయకులకి ప్రతి ఇంటికి వెళ్లే అవకాశం లేదన్నారు. భారీ మెజార్టీతో విజయం సాధించడమే వైసీపీ లక్ష్యమని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గానికి రామ్ కుమార్ రెడ్డినిఅభ్యర్థిగా ఖరారు చేశామన్నారు. ఆయనే వెంకటగిరి నుండి పోటీ చేస్తారని ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.