వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…. బుధవారం మున్సిపల్ చైర్మన్ నక్క భానుప్రియ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశం రసాభాసగా ముగిసింది అధికారుల లోపం వల్లే ఈ స్థలాన్ని మున్సిపాలిటీ పోగొట్టుకోవాల్సి వచ్చిందని కమిషనర్ పై నిప్పులు చెరిగారు ఈ సమావేశంలో వెంకటగిరిలోని మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఉన్న వారిపై చర్యలు చేపట్టి ప్రభుత్వ స్థలాలను స్వాధీన పరచుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు ఈ అత్యవసర సమావేశానికి 12 మంది కౌన్సిలర్లు హాజరవ్వగా పలువురు తమ అభిప్రాయాలను కౌన్సిల్ సమావేశంలో చర్చించారు ఇటీవల సర్వే నంబర్ 227లో 10 లో ఉన్న 48 సెంట్లు ప్రభుత్వ భూమేనని దానిని గతంలో ఉన్న వ్యక్తులు స్వాధీన పరచుకోవడానికి ప్రయత్నించగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్వాధీన పరచుకొని దానిలో ప్రభుత్వ భూమి అని బోర్డింగ్లు ఏర్పాటు చేశారని మరల అదే వ్యక్తులు ఇప్పుడు దీనిని స్వాధీనం చేసుకున్నారని ఇది ఎలా సాధ్యమైందని మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్యను సభ్యులు నిలదీశారు దీనికి స్పందించిన కమిషనర్ దీనికి సంబంధించిన రికార్డు తన వద్ద ఏమీ లేదని గతంలో దీనిపై రెవెన్యూ ప్రైవేట్ వ్యక్తుల మధ్య కోర్టులో వ్యవహారం జరిగిందని ఈ విషయంలో తాను కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎలాంటి అవినీతికి అవకతవకలకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు వైస్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో ఈ భూమిని పోలయ్య అనే వ్యక్తికి ప్రభుత్వం ఏక్ సాల్ లీజు పట్టా ఇచ్చి ఉన్నదని ఆ తర్వాత ఆ పట్టాను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవలసి ఉండగా ఆయన ఒక్కసారి కూడా రెన్యువల్ చేసుకోలేదని ఇప్పుడు ఇది ఎలా సెటిల్మెంట్ పట్టాయిందని గతంలో ఈ స్థలము నేత పరంబోకుగా ఉండేదని ఆయన ఇప్పుడు ఈ స్థలంలో వ్యవసాయం చేయలేదని అలాంటప్పుడు ఆయనకి హక్కు