టీడీపీ సీనియర్ నాయకులు విజ్ఞప్తి.
కలువాయి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్.
తెలుగు దేశం పార్టీ అధిష్టానం వెంకటగిరి నియోజకవర్గం బీసీ సామాజిక వర్గానికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని జిల్లా టీడీపీ ఆర్గనై జింగ్ సెక్రటరీ అల్లంపాటి వేణు గోపాల్ రెడ్డి, కలువాయి టౌన్ మాజీ అధ్యక్షులు నరసింహులు యాదవ్ కోరారు. కలువాయి లో జిల్లా టీడీపీ ఆర్గనై జింగ్ సెక్రటరీ అల్లంపాటి వేణు గోపాల్ రెడ్డి, కలువాయి టౌన్ మాజీ అధ్యక్షులు నరసింహులు యాదవ్,మండల బీసీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
వెంకటగిరి నియోజవర్గంలో బీసీ జనాభా అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయిస్తే పార్టీ సునాయాసంగా గెలుస్తుందని చెప్పారు.,అనేక ఏళ్లుగా వెంకటగిరి నియోజకవర్గ స్థానం జనరల్ అభ్యర్థికే కేటాయించారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు జ్యోకం చేసుకొని వెంకటగిరి టికెట్ ఇకనైనా బీసీలకు కేటాయించాలని కోరారు. నియోజకవర్గం లోటీడీపీ అభ్యర్థి బీసీ లకు ఇస్తే విజయం నల్లేరు మీద నడకగా మారుతొందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో కలువాయి మండల టీడీపీ నాయకులు చెంచు రామయ్య యాదవ్, వెంకటయ్య, శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.