సైదాపురం6,వెంకటగిరి అసెంబ్లీ ఎక్స్ ప్రెస్:
సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో గిరిజన యువకుడు పంతగిరి శ్రీనివాసులు( 25)అనారోగ్యం తో మరణించడం తో మంగళవారం కొమ్మి శ్రీనివాసులు చౌదరి మెట్టకూరు దనుంజయ్య దృష్టికి తీసుకు వెళ్ళారు. ఎం సి ట్రస్ట్ తరపున పేద గిరిజన మృతుడు పంతగిరి శ్రీనివాసులు కుటుంబానికి రూ.10,000లు దహన సంస్కారాలు కోసం కుటుంబ శ్రీనివాస్ చౌదరి చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. వై ఎస్ ఆర్ ఇన్సూరెన్స్ అందే పరిస్థితి లేక పోవడం తో ట్రస్ట్ అందించిన సహాయం తో అంత్యక్రియల ఖర్చులకు జరుపుకుంటామని మృతుడి కుటుంబ సభ్యులు మెట్టకూరు దనుంజయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో 6వ వార్డు మెంబర్ ఎల్లంపల్లి రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.