బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
మనిషి ఆందోళన చెందకుండ ఉండేందుకు వేమన పద్యాలతో ఆత్మజ్ఞానం ఉందని సోమవారం మండ లంలోని జయంపు గ్రామంలో త్రైత సిద్ధాంతం- ప్రబోధసేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక – శ్రీకాళ హస్తి కమిటీ అధ్యక్షుడు చింత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేమన నీతి వాక్యాలు ప్రచారం
చేశారు. ఈసందర్భంగా ప్రతి ఇంటికి త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల స్వామివారు రచించినటువంటి త్రైత సిద్ధాంత భగవద్గీత,వేమన పద్యాల అను బంధ గ్రంథములను ప్రచారం నిర్వహిస్తూ
ఆధ్యాత్మికతను అవగాహన కల్పించి దేవాల యములలోని రహస్యములను, హిందుత్వ ములోని సాంప్రదాయములను, మనపండుగల ఆచరణలోని జ్ఞానార్థములను,వేమన భగవాన్ పద్యాల లోని జ్ఞానం ను తెలియజేయటం జరిగింది. కార్యక్రమంలో త్రైతసిద్ధాంతం-ప్రబోధ సేవాసమితి ఇందూ జ్ఞాన వేదిక- శ్రీకాళహస్తి కమిటీ అధ్యక్షుడు, సభ్యులు చింతా సుబ్రహ్మణ్యం వెంకటలక్ష్మి, సుధ, శ్రీనివాసులు, అమరావతి, చామంతి, రామకృష్ణ, అనూష, తస్లీమ్, షకీలా, రమణయ్య, పద్మ, భవాని, శేషాద్రి, వెంకట రత్నమ్మ, సురేష్ యాదవ్, జయసుధ, ఉదయ్ కిరణ్, లీలకృష్ణ, ప్రబోధ కృష్ణ, రాజేష్ యాదవ్ తదితరులు ప్రచారం లో పాల్గొన్నారు.
పోటో:-ప్రచారం చేస్తున్నా దృశ్యం