కలువాయి వెంకటగిరి ఎ క్స్ ప్రెస్ న్యూస్ :
మండలం లోని అన్ని పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు జన్ భగీధారి కార్యక్రమాన్ని నిర్వహించాలని మండల విద్యాధికారి శేషు గిరి తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి పాఠశాల విద్యార్థులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం అనే థీమ్ మీద డ్రాయింగ్ , ,వ్యాస రచన , క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించి బహుమతులు ఇవ్వవాలని అందజేయాలని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞను చేయించాలని తెలిపారు. మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చక్కగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.
గ్రామ సచివాలయం ల్లో….
మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు జన్ భాగీ దారి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయముల లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటమునకు పూలమాల వేసి ప్రజలు ,స్థానిక ప్రజా ప్రతి నిధులు భారత రాజ్యాంగము ప్రియాంబుల్ ప్లెడ్జ్ కార్యక్రమమును నిర్వహించాలని ఈ ఓ పి ఆర్ డి నారాయణ ఒక ప్రకటన లో చెప్పారు. ఫోటోలు తీసి గ్రూప్ లో పోస్ట్ చేయవలసినదిగా తెలియజేయాలన్నారు. అంబేద్కర్ విగ్రహములను అలంకరించి..ప్రజా ప్రతినిధులచే పూలమాల వేయించాలని సూచించారు.