వెంకటగిరి : వెంకటగిరి నియోజకవర్గంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో అధికారులు, బీజేపీ నాయకులు జోరుగా పర్యటిస్తూ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. డక్కిలి మండలంలోని పాతనాలపాడు గ్రామంలో “వికసిత్ భారత్ సంకల్పయాత్ర ” కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ ఎస్. ఎస్. ఆర్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన కింద కొత్తగా 75 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిందన్నారు. విశ్వకర్మ యోజన కింద 18 కులాల చేతివృత్తుల వారికి 15 రోజులపాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో రోజుకి 500 రూపాయలు బత్తా ఇచ్చి 15 రోజుల తర్వాత వారికి అవసరమైన పనిముట్లను 15 వేల రూపాయల వరకు విలువ చేసే పనిముట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. అంతేకాకుండా వీటి ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నారని వాటిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు. అలా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అధికారులు చూసుకోవాలని, అర్హులైన వారందరికీ అవి అందేలా చేయాలని,అది ప్రభుత్వ అధికారుల విధి అని తెలియజేశారు. తరువాత గ్రామంలో ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ మరియు ఉచితంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది.తదుపరి నరేంద్ర మోడీ గారి క్యాలెండర్లు, నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ కో కన్వీనర్ ఈతముక్కల యోగేశ్వరరావు, బీజేపీ మండల అధ్యక్షులు కొల్లూరు బాలకృష్ణ నాయుడు, ప్రధాన కార్యదర్శులు నీలపనేని గుండాలు దేవర, గోపాల్ నాయుడు, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, బుధవారపు అంకయ్య,వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు తదితరులు పాల్గొన్నరు.