వెంకటగిరి న్యూస్ : రాపూర్ లో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర విజయవంతంపై వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేశారని వైసీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాపూర్ తెలుగుగంగ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మధు రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర విజయవంతం చేసినందుకు రాపూరు మండల ప్రజానీకం వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలుఎంతో కష్టపడి ఈ సభను విజయవంతం చేశారని, అలాగే కొన్ని చానల్స్ సభను దుష్ప్రచారం చేశారన్నారు. సభకు ఎంత మంది జనాభా వచ్చారో అందరూ చూశారని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రెండునెలల్లో రాబోయే ఎన్నికల్లో రామ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు. జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మధు రెడ్డి అధ్యక్షతన సామాజిక సాధికార యాత్ర విజయవంతం చేసిన ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల అధ్యక్షుడు పాప కన్ను దయాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పెంచల్ రెడ్డి, తెగ చర్ల మండల నాయకులు మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, విజయ మోహన్ రెడ్డి, గని, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు