– ఎస్మా ప్రయోగంపై అంగన్వాడీల అభ్యంతరం..
– అంగన్వాడీ కేంద్రాలకు నోటీసులు
– చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిక
– వెంటనే విధులకు హాజరు కావాలని ఆదేశం
బాలాయపల్లి : తమ డిమాండ్ల సాధన కోసం 26 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు అంగన్వాడీలు.. వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో.. ప్రభుత్వం జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయి.. దీంతో, అంగన్వాడీలపై సీరియస్ యాక్షన్‌కు దిగింది ఏపీ ప్రభుత్వం.. వారిపై ఎస్మా ప్రయోగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్.. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నెం.2 తీసుకొచ్చింది.. అయితే, ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. తమను అదిరించి, బెదిరించి ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. తమకు కనీస వేతనం 26,000 ఇచ్చి తీరాలని లేదంటే అప్పటివరకు సమ్మె చేసి తీరతాం అంటున్నారు. అత్యవసర విధులు అనుకుంటే, తమకు అందాల్సిన హక్కుల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని గుర్తు చేస్తున్నారు అంగన్వాడీలు. తాము హక్కుల సాధన కోసం ఎంతవరకైనా పోరాడుతామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలు చేసే వరకు సమ్మె విరమించబోమని తేల్చేశారు అంగన్వాడీలు.
మొండి వైఖరి మానుకోవాలి : స్వరూప రాణి
– వెంకటగిరి ప్రాజెక్టు ఐసీడీఎస్ నాయకురాలు
రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి. 26 రోజులు నుంచి సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభు త్వం పట్టించుకోకుండా తమపై నోటీసులు ఇవ్వ డం దారుణం. తాము అడుగు తున్నది కార్మిక చట్టం ప్రకారం పనికి తగ్గ వేతనం అది ఇచ్చేందుకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉందో అర్థం కావడం లేదు. అంగనవాడి కేంద్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తలు, ఆయాలు అతి తక్కువ పారితోషకంతో పనిచేస్తున్నారు. ఎన్ని నోటీసు లు వచ్చినా కేసులు పెట్టి జైళ్లకు పంపించిన ధర్నా లు కొనసాగిస్తాం.
పోటో:- కలెక్టర్ పేరిట విడుదలైన నోటీసులు
పోటో:- సమ్మె చేస్తున్న అంగన్వాడీలు
ఫోటో:- స్వరూప రాణి, అంగన్వాడీ రాష్ట్ర నాయకురాలు