ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం, డక్కిలి మండలం, పాతనాలపాడు గ్రామంలో “వికసిత్ భారత్ సంకల్పయాత్ర ” కార్యక్రమమునకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఎస్. ఎస్. ఆర్ నాయుడు గారు మరియు మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన కింద కొత్తగా 75 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసిందని, విశ్వకర్మ యోజన కింద 18 కులాల చేతివృత్తుల వారికి 15 రోజులపాటు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణలో రోజుకి 500 రూపాయలు బత్తా ఇచ్చి 15 రోజుల తర్వాత వారికి అవసరమైన పనిముట్లను 15 వేల రూపాయల వరకు విలువ చేసే పనిముట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, అంతేకాకుండా వీటి ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నారని వాటిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు. అలా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి వివరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ తెలియజేసే విధంగా అధికారులు చూసుకోవాలని, అర్హులైన వారందరికీ అవి అందేలా చేయాలని,అది ప్రభుత్వ అధికారుల విధి అని తెలియజేశారు. తరువాత గ్రామంలో ఆయుష్మాన్ భారత్ కార్డుల పంపిణీ మరియు ఉచితంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది.తదుపరి నరేంద్ర మోడీ గారి క్యాలెండర్లు, నరేంద్ర మోడీ గారు తొమ్మిది సంవత్సరాల సుపరిపాలన కరపత్రములు, అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్. ఎస్. ఆర్ నాయుడు గారితో పాటు, వెంకటగిరి నియోజకవర్గ కో కన్వీనర్ ఈతముక్కల యోగేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరు బాలకృష్ణ నాయుడు గారు ప్రధాన కార్యదర్శులు నీలపనేని గుండాలు దేవర, గోపాల్ నాయుడు, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, బుధవారపు అంకయ్య,వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, భారతీయ జనతా పార్టీ మండల మరియు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అసమర్థత. ఆర్థిక .అవినీతి కి పాల్పడిన APM లను ప్రశ్నించినందుకు అర్థం లేని అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యం నోరు నొక్కి వేస్తున్న డక్కిలి మండలం వెలుగు APM గారి పైన రేపు 07.01.2024 ఆదివారం ఉదయం.11. గంటలకు వెంకటగిరి యందు ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక కార్యాలయం నందుజరిగే విలేకరుల సమావేశం కు ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మరియు ప్రజలు. ప్రజాస్వామికవాదులు. మేధావులు. ప్రజాసంఘాలు నాయుకులు, దళిత గిరిజన .సంఘాల నాయుకులు, బీసీ సంఘాల నాయుకులు .రాజకీయవాదులు .తప్పకుండా హాజరై ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనీ కోరుకుంటున్నాను.*
సామాజిక ఉద్యమ అభివందనాలతో
గద్దల మునెయ్య
AP ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు
cell….9701273584