బస్సు టాప్ పైన సినీ నటుడు ఆలీ, ఎమ్మెల్సీ మెరుగు మురళి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నెల్లూరు మేయర్ స్రవంతి, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగింది.
అనంతరం వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారిని వైసిపి తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మెరుగు మురళి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, నెల్లూరు మేయర్ స్రవంతి తదితరులు దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ పోలేరమ్మ దేవాలయం నుండి రాపూర్ రోడ్డు మార్గన మిట్టపాలెం, దక్కిలి, రాపూరు బహిరంగ సభ వరకు బస్సు యాత్ర జరిగింది.
దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రజాప్రతినిధులు అంతే ఆసక్తితో దారి పొడవునా స్వాగతం పలికిన కార్యకర్తలు అభిమానులు.
బస్సు యాత్రలో పాల్గొన్న సినీ నటుడు ఆలి.
ఆలి ని చూసేందుకు రోడ్ పొడవునా మహిళలు, పిల్లలు పడిగాపులు.
ఆలి డక్కిలి లో బస్సు యాత్రలో ప్రసంగిస్తూ రానున్న ఎన్నికలలో వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామన్నను గెలిపించుకోవాలని ఆయన అన్నారు.
అనంతరం రాపూరు కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న నాయకులు.
నెల్లూరు జిల్లా రాపూరులో జరిగిన సామాజిక సాధికారిక బస్సు యాత్రలో పాల్గొని మాట్లాడిన ఆలీ…
ఆలీ కామెంట్స్
తన తండ్రి నడిచిన బాటలో సీఎం జగన్ మోహన్ నడుస్తున్నారు..
తాను చేసే సాయం ఇంకా చాలా మందికి అందాలా చేరాలా అనేది ఆయన మనస్సులో మాట..
16 నెలలు జైలులో ఉన్నా ముఖంపై చిరునవ్వు చెరగలేదు…
మూడేళ్లు పాదయాత్ర చేసి 151 సీట్లు సంపాదించారో అది అభిమానం అంటే..
వై నాట్ 175…
రాబోయే ఎన్నికలో 175 స్ధానాలలో గెలుపుని ప్రజలే డిసైడ్ చేయాలి..
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిని అభిమానించినట్లు తన కుమారుడు రామ్ కుమార్ ను దీవించండి…
రాష్ట్రంలో పథకాలు ప్రతీ ఇంటికి చేరుతున్నాయి..కాబట్టీ కాబోయే ఎన్నికలో గెలిపించాలిలని పిలుపు..
వై నాట్ 175 ను మనం గిఫ్ట్ గా ఇవ్వాలి…
2024 కు జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది..
గత ప్రభుత్వంలో బిసి, ఎస్సీ, ఎస్టీలు ఎక్కడికి పోయారు..వైసీపీ ప్రభుత్వం ఎందుకు కనిపిస్తున్నారు..వైసీపీ అందరి పార్టీ..
మాట తప్పడు మడమ తిప్పని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…
రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ , అత్యధిక సీట్లు ఇచ్చి ఆశ్వీరదించాలని కోరారు…